అక్టోబర్ 18 నుంచి లీఈకో దీపావళి సేల్

leeco-to-host-diwali-sale-from-october-18-to-october-20-on-its-online-store

తమ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ‘లీమాల్’ ద్వారా భారత్‌లో దీపావళి సేల్‌ను ప్రారంభించనున్నట్లు చైనా కంపెనీ లీఈకో ప్రకటించింది. ‘లీమాల్ ఫర్ ఆల్’ పేరిట అందిస్తున్న ఈ సేల్ అక్టోబర్ 18 నుంచి 20 తేదీ వరకు కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. ఇదే పేరుతో ఆగస్టులో నిర్వహించిన అమ్మకాలకు కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని సంస్థ చెపుతోంది. గత ఆఫర్ సేల్‌ ద్వారా లీమాల్‌లో కొనుగోలు చేసిన లీ 2, లీ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌లతో రూ. 1900 విలువ గల సీడీఎల్ఏ ఇయర్‌ఫోన్స్‌ను ఉచితంగా ఇచ్చారు. అలాగే యాక్సెసిరీస్‌పై కూడా డీల్స్, డిస్కౌంట్‌లను లీమాల్ అందజేసింది.
అదేవిధంగా ఇప్పుడు కూడా ‘లీమాల్ ఫర్ ఆల్ సేల్’ను నిర్వహించనున్నారు. లీఈకో సెకెండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లు, సూపర్2 సిరీస్ టీవీలపై కచ్చితంగా ఆఫర్లు అందజేస్తామని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా సీడీఎల్ఏ ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్, ఆల్ మెటల్ ఇయర్‌ఫోన్స్, రివర్స్ ఇన్-ఇయర్‌ఫోన్స్, కవర్స్/కేసెస్ వంటి యాక్సెసిరీస్‌పై ధరల తగ్గింపు ఉంటుందని వివరించింది. ఈ సేల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*