విరుచుకుపడుతున్న పిడుగులు ఒక్కరోజులో 41,025 పిడుగులు

నిన్న ఒక్కరోజులోనే ఏపీ వ్యాప్తంగా 41,025 పిడుగులు పడగా, 14 మంది మరణించారు. ఇక మార్చి 16 నుంచి ఇప్పటివరకూ 1,40,982 లక్షల పిడుగులు పడ్డాయని, ఇవి తాకి 39 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఇది అధికార లెక్క కాగా, అనధికార లెక్కలు కూడా ఇంతే స్థాయిలో ఉండవచ్చని అంచనా.అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. అదే సమయంలో ఉరుములు, మెరుపులు భయపెడుతున్నాయి. చెవులకు చిల్లులు పడేలా శబ్దం చేస్తూ, నేలను తాకుతున్న పిడుగుల ధాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు.  ఇదే సమయంలో సముద్రంపై నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగి ఆకాశంలో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తుంటాయని, ప్రజలు తగు జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*