– అప్పన్న స్వామి వారి ఆశీస్సుల కోసం సింహాచలం విచ్చేసిన డీసీపీ-2
ఆనంద రెడ్డి ఇటీవల పదోన్నతి పొంది నూతన పదవీ బాధ్యతను స్వీకరించడానికి ముందుగా స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ధ్వజస్థంభం వద్ద ఆయనకు ఆలయ అధికారులు సోమవారం స్వాగతం పలికారు. బేడా ప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకుని కప్పస్థంబం ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందచేశారు. స్వామి వారి శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్రస్టీ వారణాసి దినేష్ రాజ్, శ్రీదేవి వర్మ, ఆలయ ఏఈఓ నరసింహ రాజు, ఆలయ ఇన్స్పెక్టర్ కనకరాజు, గోపాలపట్నం శాంతిభద్రతల సి ఐ విజయ్ కుమార్ తదితులు పాల్గొన్నారు.