16వ వార్డు పరిధి, భానునగర్, విద్యానగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జి.వి.ఎం.సి పార్కు అభివృద్ది పనులకు జీవీఎంసీ నిధుల నుండి రూ. 17 లక్షలతో వార్డు వైసీపీ కార్పొరేటర్ మొల్లి లక్ష్మీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి సారధ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి వారి సౌకర్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏ.పి.ఐ.ఐ.సి. డైరక్టర్ మొల్లి అప్పారావు, అసోసియేషన్ సభ్యులు మరియు వార్డు అద్యక్షులు చొల్లంగి నాగేశ్వరరావు, మీసాల ప్రదీప్, విజయ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.