కిడ్జ్ గార్డెన్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఎంవీపీ కాలనీ, ఉషోదయా జంక్షన్ లో గల కిడ్జ్ గార్డెన్ పబ్లిక్ స్కూల్ లో సోమవారం బాలల దినోత్సవ వేడుకలు స్కూల్ ప్రిన్సిపాల్ సాయిలక్ష్మీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిల్లలు సాంస్కృతిక నృత్యాలు, వెస్ట్రన్ డాన్స్ లతో అందరి మనసులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సాయిలక్ష్మీ చిన్నారులకు చాచా నెహ్రూ గురించి తెలియజేస్తూ ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే జన్మదినమునే బాలల దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పారు. అంతా బాగా చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రిన్సిపల్ సాయిలక్ష్మీ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలతో జత కట్టి అందర్నీ ఆకర్షించారు.