వచ్చే నెలలో హర్యానాలో జరిగే 26వ ఒకినావా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ -2022 కు నగరానికి చెందిన యలమంచిలి సందీప్ కు అర్హత సాధించిన నేపథ్యంలో , ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ శుక్రవారం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినప్పటికి కరాటే లో విశేష ప్రతిభ కనబరుస్తున్న సందీప్ కు తన వంతు సహాయ సహకారాలు వుంటాయని తెలిపారు. నేషనల్ పోటీలో విజయం సాధించి ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్ళాలని సూచించారు. నిరంతర కృషి, సాధన ద్వారా తప్పకుండా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వం క్రీడాకారులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని అన్నారు.