అధికారమనే మానసిక వ్యాధితో చంద్రబాబు బాధపడుతున్నాడని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నరు శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ అతిధి గృహం లో ఏర్పాటు చేసిన మేడియబ్ సమావేశం లో ఆయన మాట్లాడారు’జనం-జగన్’ బంధం ఎప్పుడో ముడిపడిపోయిందని వచ్చే ఎన్నికల్లో జగన్ మరో సారి ముఖ్య మంత్రి అవటం తధ్యం అని అన్నరు. ఈ సారి మహిళలే చంద్రబాబును తిరస్కరించి ఇంటికి పంపడం ఖాయం మని బాబు రాజకీయ అంపశయ్యపై ఉన్నారు. జనం వెంటిలేటర్ తీసేస్తే ఇక ఆయన పని అయిపోయినట్లే బాబు ఎన్ని యాత్రలు చేసిన అవి సమర్థుడి అంతిమయాత్రలే అని ఎద్దేవా చేసారు గత మూడు రోజులుగా కర్నూలు జిల్లా పర్యటనలో బాబు పర్యటనలో మాట్లాడే మాటలు వింటుంటే రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఆయనకు నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోందని అన్నరు బాబుకు దమ్ముంటే.. గత ఎన్నికల్లో 612 వాగ్దానాలతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను బయటకు తీసి మాట్లాడాలి. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని మేము అడుగుతుంటే వెబ్‌సైట్ నుంచే మేనిఫెస్టోను తీసేశారు. ఎన్నికల సమయంలోనే బాబుకు ఎన్టీఆర్ గురుకొస్తారు, ఆయన విగ్రహాలను, ఫ్లెక్సీలను ఆవిష్కరిస్తారు. ప్రజల ముందు మాట్లాడేటప్పుడు దిగజారిపోయి మాట్లాడరాదని , ఎన్నికలు సమీపించే కొద్దీ బాబు ఇంకా దిగజారిపోతారని అన్నరు. అదేవిధంగా సంక్షేమం–అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్ గారి పాలనా నేత్రాలని సంక్షేమం, అభివృద్ధి తన పాలనా నేత్రాలుగా జగన్మోహనరెడ్డి భావిస్తున్నారు కనుకే ఆయనే తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సీతారాం పునరుద్ఘాటించారు. ఇటీవల ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలోనే వేదికపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలే తప్ప తనకు రాజకీయ ప్రయోజనాలు లేవని కుండబద్దలు కొట్టారని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ సూచించిన మేరకే విశాఖను ఆయన పాలనా రాజధానిగా ప్రకటించారని, అన్ని సానుకూలతలు ఈ నగరానికి ఉన్నాయని సీతారాం తెలిపారు. రాజధానులపై ముఖ్యమంత్రికి దూరదృష్టి ఉందని అన్నారు.
చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు
