ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మరియు సీడాప్ సంస్థల సంయుక్తంగా స్కిల్ హబ్స్ కంచరపాలెంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ ఉద్యోగ మేళాలో నాలుగు ప్రైవేటు సంస్థలు పాల్గొన్నాయి. సుమారు 178 మంది యువతీ యువకులు హాజరుకాగ 41 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేశాయి. 15 మందిని తదుపరి ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. పర్యవేక్షణలో ఎంప్లాయిమెంట్ అధికారి సుబ్బిరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్ ఎగ్జిక్యూటివ్ రమేష్ నాయుడు, శేఖర్, వై.టి.జాస్విన్ తదితరులు పాల్గొన్నారు.
జాబ్ మేళాకు స్పందన
