విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తానని బీసీ నాయకుడు సనపల లక్ష్మీ నరసింహ అన్నారు. ఈ మేరకు స్థానిక 55వ వార్డు ధర్మానగర్లో వార్డులో ఉన్న యువతని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55వ వార్డు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న సమాచారం తన దగ్గరకు వచ్చిందని బిసిల మేలు కోరుతూ ఆ ప్రాంత అభివృద్ధి కొరకు పాదయాత్ర చేస్తానని కానీ అంతకు ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ముందుగా వార్డులో పర్యటిస్తానని తెలిపారు. అనంతరం వచ్చే నెల 14 నుండి బడుగు బలహీన వర్గాల జన జాగృతి పాదయాత్ర చేస్తానని పత్రికా ప్రకటన ద్వార తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ కన్వీనర్ డాక్టర్ లక్ష్మీనరసింహ, డాక్టర్ వెంకట్, యశ్వంత్, 46 వార్డు ప్రెసిడెంట్ కాశీ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్దే ధ్యేయం
