బాలల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి స్పీకర్

ఆంధ్ర ప్రదేశ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, రామ్ కీ ఫౌండేషన్, జీవీఎంసీ స్టాఫ్ మరియు వర్కర్స్ యూనియన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సీడ్ చైల్డ్ లైన్, విద్యాశాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న బాలల వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎం.వి. ఫౌండేషన్ అనుబంధ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రొఫెసర్ శాంతా సిన్హా, నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరౌతున్నట్టు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యులు గొండు సీతారాం లు చెప్పారు. గురువారం మద్దిలపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై సుదీర్ఘ అనుభవం గల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పిల్లల కోసం ఎన్నో దశాబ్దాలుగా నిర్విరామ సేవలు అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత రామన్ మెగసేసే అవార్డ్ గ్రహీత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్పర్సన్, ప్రొఫెసర్ శాంతా సిన్హాలతో పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సీతమ్మధార, ఎస్.ఎఫ్.ఎస్.స్కూల్ మైదానంలో ప్రసంగించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు, పిల్లలతో పని చేస్తున్న ఎన్జీఓ మిత్రులు హాజరవుతారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *