బీజేపీ నేతలను అభినందించిన సోము

ప్రధానిమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభినందించారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో శనివారం ఈ సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమ ఇంఛార్జి లు, వివిధ విభాగాల బాధ్యులను అభినందించారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి స్థానిక నాయకత్వం శ్రమించిన తీరు అభినందనీయం అని  ప్రశంసించారు ప్రధానితో జరిగిన కార్యక్రమంలో జరిగిన చర్చ , రాజకీయ అంశాలు ఆధారంగా భవిష్యత్తులో పార్టీ ప్రగతి పట్ల నేతలతో ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *