మినీ జాబ్ మేళా

 

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయి్మెంట్ కార్యాలయం, సీడాప్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో జిల్లా ఉపాధి కార్యాలయం నందు 4 ప్రముఖ కంపెనీలతో 115 ఖాళీల భర్తీకి మినీ జాబ్ మేళాను నిర్వహించబడుతుంది. ఇంటర్, బిఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా కెమికల్, డిప్లొమా మెకానికల్, ఏదయినా డిగ్రీ, బీటెక్, ఎంటెక్ వరుకు చదివి ఉద్యోగం కోసం చూస్తున్న యువతీ యువకులు హాజరుకావొచ్చు. www.ncs.govt.in పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు కంపెనీల వివరాల కొరకు మరియు రిజిస్ట్రేషన్ కొరకు ఈ లింక్ ను http://shorturl.at/rR569 సంప్రదించవచ్చు. సొలారా ఫార్మా లో బిఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా కెమికల్, డిప్లొమా మెకానికల్ చదివిన యువకులు హాజరు కాగలరు. ఈ కంపెనీ కి ఎంపికైన అభ్యర్థులుకు ఏపీ సెజ్ అచ్చుతాపురంలో జాబ్ లొకేషన్ ఉంటుంది. రూ.13000 నికర వేతనంతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తారు. నోవెల్ పేటెంట్ కంపెనీలో బీటెక్ లేదా ఎంటెక్ చదివిన అభ్యర్థులు హాజరుకాగలరు. ఎంపిక అయిన యువతీ యువకులుకు రూ. 18000 – 20000 నెలకు వేతనంతో విశాఖపట్నం గంభీరంలో జాబ్ లొకేషన్ వుంటుంది. లక్ష్మీ హ్యుందాయ్ కంపెనీలో ఏదయినా డిగ్రీ లేదా ఎంబీఏ చదివిన యువతీ యువకులు హాజరుకాగలరు. ఎంపిక అయిన అభ్యర్థులకు రూ. 13000 నెల వేతనంతో విశాఖపట్నం, గాజువాక లో జాబ్ లొకేషన్ గా ఉంటుంది. బీమ్ జ్యువల్స్ కి ఇంటర్ ఆపైన చదివిన యువతీ యువకులు హాజరు కాగలరు. ఎంపిక అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లో రూ. 14000 నెల వేతనంతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తారు. మరిన్ని వివరాలుకు 7386713880, 9000123483 నెంబర్ ను సంప్రదించగలరని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సుబ్బిరెడ్డి, నైపుణ్యాభివృధి అధికారి సాయి కృష్ణ చైతన్య రెడ్డి , సీడాప్ జేడీమ్ కళ్యాణి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *