ఆంధ్ర ప్రదేశ్ స్కిల్స్ ట్రైనింగ్ జాబ్ ఫెయిర్స్ సలహాదారుడు మిలీనియం శ్రీధర్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని హైదరాబాదులో తన స్వగృహంలో సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తనకు కొన్ని సూచనలు, సలహాలు చేశారని మిలీనియం శ్రీధర్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి వమ్ము చేయకుండా సేవ చేస్తానని, ఒక సైనికుడిలా పనిచేసి తన పదవికి న్యాయం చేస్తానని శ్రీధర్ రెడ్డి తెలిపారు.