మోడీ వైజాగ్ టూర్ : చివరి నిమిషంలో ట్విస్టులు- తెరపైకి రోడ్ షో- రైల్వే జోన్ కు షాక్..!

ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖ రాబోతున్నారు. ఈ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే బీజేపీ, వైసీపీ నేతలు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటిస్తున్నారు. అయితే ఇందులో చివరి నిమిషంలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ అధికారిక పర్యటను వైసీపీ హైజాక్ చేస్తోందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీ వైజాగ్ టూర్ ప్రధాని మోడీ వైజాగ్ టూర్ షెడ్యూల్ ను బీజేపీ నేతలు గత వారమే వెల్లడించారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరోసారి ప్రకటించారు. అయితే ఇందులో ఏడుకీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంఖుస్ధాపన చేయబోతున్నట్లు వెల్లడైంది. ఈ ప్రకటనల తర్వాత హైకోర్టు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ప్రధాని షెడ్యూల్ లో భోగాపురం పోర్టు శంఖుస్ధాపనను కూడా చేర్చాలని వైసీపీ పట్టుబడుతోంది. అటు బీజేపీ కూడా ప్రధాని టూర్ లో తన మార్కు ఉండాలని భావిస్తోంది. దీంతో చివరి నిమిషంలో పలు మార్పులు తప్పడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *