విశాఖ నగరంలోని యువత ఆకాంక్షలకు అనుగుణంగా స్పోర్ట్స్, అడ్వెంచర్, ట్యూరల్, అండ్ క్రూయిజర్ వాహనాలను అందిస్తామని భారతదేశపు ఏకైక బహుళ బ్రాండ్ సూపర్ బైక్ ఫ్రాంచైజ్ మోటో వాల్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝాబక్ తెలిపారు. అధీస్వర్ ఆటో రైడ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని ఇసుకతోట వద్ద శుక్రవారం మోటో వాల్ట్ మల్టీ బ్రాండ్ సూపర్ బైక్ షో రూం ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఆటోమొబైల్ రంగం కూడా ఆధునికత, సాంకేతికతల మేళవింపుతో నూతన ఆవిష్కరణలు చేస్తూ ముందుకు దూసుకపోతోందన్నారు. తాము ఈ వ్యాపారావకాశాలను అందిపుచ్చుకుని నాణ్యమైన వాహనాలను సరఫరా చేస్తామన్నారు. తమ యొక్క ముఖ్యమైన ప్రతి వినియోగదారునికి సూపర్ బైక్ అనుభవంలో అత్యుత్తమంగా వుండేలా భారత దేశం అంతటా పలు టచ్ పాయింట్లను ప్రారంభిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఝబక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఝబక్ మాట్లాడుతూ తమ వినియోగదారులకు నాణ్యమైన వుత్పత్తులను సరఫరా చేసి వారి మన్ననలందుకుంటా మన్నారు. ఈ కార్యక్రమంలో మోటో వాల్ట్ నెట్వర్క్ డెవలపర్ ఫరూఖ్ ఖాన్, స్థానిక ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.