ఎంప్లాయి్మెంట్ కార్యాలయం, ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన 5 ప్రముఖ కంపెనీలతో 200 ఖాళీల భర్తీకి జాబ్ మేళాను నిర్వహించబడుతుంది. పది, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఐటిఐ, డిప్లొమా వరుకు చదివి ఉద్యోగం కోసం చూస్తున్న యువతీ యువకులు హాజరుకావొచ్చు. www.ncs.govt.in పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు కంపెనీల వివరాల కొరకు మరియు రిజిస్ట్రేషన్ కొరకు ఈ లింక్ ను సంప్రదించవచ్చు. ఎంపిక అయిన యువతకు నెలకు రూ. 10000 – 20000 లు ఉంటుందని విశాఖపట్నం, గాజువాకలలో జాబ్ లొకేషన్ ఉంటుందని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సుబ్బిరెడ్డి, తెలియజేశారు. ఆసక్తి గల 18-40 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులు ఈ నెల 22వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయంకు ఉదయం 9.00 గంటలకు హాజరు కావాలని తెలియజేశారు.
విశాఖలో జాబ్ మేళా
