ప్రభుత్వం నుంచి ప్రజలు పొందిన లబ్దిని వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి మెరుగైన పాలన అందించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల అన్నారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గ పరిధిలో గల 15వ వార్డు న్యూ వెంకోజీపాలెంలొ కార్పొరేటర్ అపరి శ్రీవిద్య ఆధ్వర్యంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు. ఈ మేరకు కొండవాలు ప్రాంతంలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. Isగడప గడపకూ నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ, మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్మోహన్రెడ్డి మొదలుకుని ప్రజా ప్రతినిధులమంతా పేదల సంక్షేమానికే పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సి.ఓ.రమణి, అడ్మిన్ గౌతమ్, సెక్రెటరీస్, వాలంటీర్లు, వార్డ్ ప్రెసిడెంట్ పీలా వెంకట్, నరాల సత్తిబాబు, బుగత ఏసు రత్నం, వెంకట లక్ష్మి, గొలగాని త్రినాధ్, నారాయణరావు, అచ్చుత, రాజారావు, సూరిశెట్టి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయం… గడప గడపకు విశేష స్పందన
