ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని కృష్ణకు ఏ.పి.ఐ.ఐ.సి. డైరక్టర్ మొల్లి అప్పారావు మంగళవారం ఘన నివాళి అర్పించారు. 16వ వార్డు, ఇసుకతోట, రజకనగర్ వద్ద కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమకు మకుటం లేని మహారాజని, ఎంతో మంది పేద ప్రజలకు ధానధర్మాలు చేసిన కలియుగ కర్ణుడు, తెలుగు సినిమా పరిశ్రమకు మొట్ట మొదటిగా 70 ఎం.ఎం. స్కోప్, ఈస్ట్ మన్ కలర్, డి.టి.ఎస్ పరిచయం చేసిన మార్గదర్శి, తెలుగు సినిమాను మోసగాళ్ళకు మోసగాడు ద్వార హాలీవుడ్ పుంతలు తొక్కించిన కథానాయకుడని, ఏలూరు మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ మరణానికి చింతిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో 15 వ వార్డు కార్పొరేటర్, వైసీపీ ఇంచార్జి అప్పారీ శ్రీ విద్యా గిరిబాబు, 23వ వార్డు వైసీపీ ఇంచార్జి గుడ్ల సత్యారెడ్డి, 28వ వార్డు వైసీపీ ఇంచార్జి పల్లా దుర్గారావు, 17వ వార్డు వైసీపీ ఇంచార్జి గేదెల నాగరాజు, 12వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణి, పి.వి సూర్రెడ్డి, శ్రీనివాస రెడ్డి మరియు కృష్ణ అభిమానులు చొల్లంగి నాగేశ్వరరావు, చొల్లంగి సూర్యారావు, మీసాల ప్రదీప్, ఒమ్మి వెంకటరమణ, వేములవలస అప్పారావు, దమరసింగి వెంకట రమణ, చింతా వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.