సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున అన్నారు. శనివారం సాయంత్రం ఎమ్.వి.పి.కాలనీ రైతు బజార్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన “అవని ఆర్గానిక్ స్టోర్” ను జిల్లా జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ రకాల ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్గానిక్ మరియు సహజ పద్దతుల్లో ఉత్పత్తులైన పప్పు దినుసులు, కూరగాయలు, గానుగ నూనెలు, శిరి ధాన్యాలు తదితరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిఇఒ, రైతు బజార్, ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారికి ఈ స్టోర్ కేటాయించినట్లు తెలిపారు. ఆర్గానిక్ మరియు సహజ పద్దతుల్లో ఉత్పత్తులైన పప్పు దినుసులు, కూరగాయలు, గానుగ నూనెలు, శిరి ధాన్యాలు విక్రయిస్తారన్నారు. రైతు సాధికారిక సంస్థ ద్వారా శిక్షణ పొందినవారిని ప్రోత్సాహిండం జరుగుతుందన్నారు.
అనంతరం రైతు బజార్ లో ప్లాస్టిక్ నిషేధం పై రైతులతో మాట్లాడి వారు వినియోగిస్తున్న క్లాత్ కవర్లు ను పరిశీలించారు. అదే విధంగా వినియోగదారులతో ప్లాస్టిక్ నిషేధం పై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు
సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పెరగాలి
