హిడెన్ స్ప్రౌట్స్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

లాసన్స్ బే కాలనీలో గల మానసిక, దివ్యాంగుల హిడెన్ స్ప్రౌట్స్ ప్రత్యేక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు గురుస్థానం ది ప్లే స్కూల్‌ డైరెక్టర్ ఎస్.ఖాన్ మానసిక, దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ బాబాజీ కి పిల్లల పై గల ప్రేమకు వారసులు కావాలని పిల్లలు ప్రదర్శించిన కళా నైపుణ్యానికి ముగ్ధులై భవిష్య భారతావానికి వారసులై విద్యార్థులందరూ అన్ని రంగాలలో రానించాలని అన్నారు.  నవభారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని దానికి తగిన విధంగా సృజనను, మేధస్సును పెంపొందించుకోవాలని ఉద్భోదించారు.  దివ్యాంగులు వివిధ విభాగాలలో ప్రతిభను చూపిన విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహించారు. పాఠశాల నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గురుస్థానం ది ప్లే స్కూల్‌ డైరెక్టర్ ఎస్.ఖాన్ మానసిక, దివ్యాంగుల మధ్య బాలల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదే విధంగా మానసిక దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక, ఆధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *