లారీలు బంద్‌

ఈనెల 20 ఉదయం 6 గంటల నుంచి దేశ వ్యాప్తంగా లారీల నిరవధిక బంద్‌ చేపట్టేందుకు ఆలిండియా మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా 90 లక్షల లారీలు, మూడు లక్షల లారీలు నిలిచిపోనున్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు రేటు తగ్గినా దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయి. దీంతో రవాణా రంగంపై పెను భారం పడుతోంది. దేశంలో ఈ ధరలు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. ఎపి వంటి రాష్ట్రాల్లో ఇంధనం ధరలు ఎక్కువగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం టోల్‌ ఛార్జీని ఏడాదికోరే పెంచాల్సి ఉండగా ఏడాదికి మూడు సార్లు ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. . దీనికి 18 శాతం జిఎస్టీ అదనపు భారమవుతోంది. గతంలో లారీకి నెలకు రూ.7500 ఆదాయాన్ని చూపడంతో రెండు లారీల వరకూ ఆదాయ పన్ను ఉండేది కాదు. మూడో లారీ నుంచి ఆదాయ పన్నును చెల్లించేవారు. ప్రస్తుతం లారీల లెక్కను బట్టి కాకుండా, ఆదాయ పన్ను సెక్షన్‌ 44 ఎ ప్రకారం టన్నుకు రూ.వెయ్యి చొప్పున పన్నును వసూలు చేస్తుండటంతో ఒక్కో వాహనానికి రూ.లక్ష వరకూ చెల్లించాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా 30 నుంచి 35 శాతం లారీలకు డ్రైవర్ల కొరత వేధిస్తోంది.సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఏలూరు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అమరావతి అశోక్‌ బాబు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*