పార్లమెంట్‌లోఏపి ఎంపిల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని అంశాలు, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నేడు(మంగళవారం) స్వల్పకాలిక చర్చ జరగనుంది.దాదాపు మూడు గంటల సేపు జరిగే ఈ చర్చలో అన్ని పార్టీల నేతలు పాల్గొంటారు. పార్టీల ప్రతినిధులు మాట్లాడిన తరువాత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానమిస్తారు. వైసిపి ఎంపిలు కూడా విభజన హామీలపై స్వల్పకాలిక చర్చకు డిమాండ్‌ చేస్తూ నోటీసులు ఇచ్చారు. వెంటనే రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని ”మీరిచ్చిన నోటీసులను పరిగణలోకి తీసుకున్నాం. మీరు నన్ను నియంత్రిస్తే కుదరదు. స్వల్పకాలిక చర్చకోసం నిర్ణయం తీసుకున్నాం. మీరు దయచేసి కూర్చోండి. విభజన హామీలపై మంగళవారం స్వల్పకాలిక చర్చకు బిఎసిలో నిర్ణయం తీసుకున్నాం” అని పేర్కొన్నారు. వెంటనే సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు వెల్‌లోకి వెళ్లాలని మిగత టిడిపి సభ్యులకి కనుసైగ చేశారు. వెంటనే టిడిపి సభ్యులు తోట సీతామహాలక్ష్మీ, టి.జి వెంకటేష్‌, కనకమేడల రవీంద్రబాబు, గరికిపాటి మోహన్‌రావులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. వైసిపి సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*