మడోన్నాను కదిలించిన కాందీల్ కథ

madonna-narrates-new-documentary-about-qandeel-baloch

ప్రపంచం మెచ్చిన పాప్ స్టార్ మడోన్నా రచయిత్రిగా మారింది. ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ కు తన మాటల్ని అందించింది. మడోన్నానే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ కి రచన చేసిందంటే ఆ ఫిల్మ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఆ షార్ట్ ఫాల్మ్ పాకిస్థాన్ మోడల్ కాందీల్ బలోచ్ గురించి. పాక్ సోషల్ మీడియా సంచలనమైన కాందీల్ ను సొంత సోదరుడే హత్య చేశాడు. అభ్యంతరకర దుస్తులతో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ… ఇంటి పరువు తీస్తోందని అందుకే చంపేశానని కూడా చెప్పాడు. కాందీల్ కథ అందరిలాగే మడోన్నాను కూడా కదిలించింది. రెండు సార్లు ఆస్కార్ అందుకున్న పాక్ ఫిల్మ్ మేకర్ షర్బీన్ ఒబైద్ చినోయ్ కాందీల్ పై తీసిన డాక్యుమెంటరీకి తన రచనను అందించింది. ఆ ఫిల్మ్ పేరు ‘కాందీల్ బలోచ్: ఏ వెరీ షార్ట్ స్టోరీ’. కేవలం ఒకటిన్నర నిమిషాల పాటు ఉండే ఈ ఫిల్మ్ లో కాందీల్ వీడియోలు ఉన్నాయి. అలాగే ఆమె హత్యానంతరం వీడియోలు, తండ్రి అభిప్రాయం ఉంటాయి. వారం క్రితం మడోన్నా తన ఫేస్‌బుక్ పేజీలో కాందీల్ గురించి ప్రస్తావించింది. పాకిస్థాన్ పరువు హత్యల వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టి హంతకులకు తప్పించుకునే అవకాశం లేకుండా చేసిందని, కాందీల్ లాంటి అమ్మాయిలు హత్యకు గురికాకముందే ఈ బిల్లును తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*