నగదురహిత లావాదేవీలకు మద్దతు పెరిగింది: మోదీ

దిల్లీ: దేశం కోసం భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు ప్రాణాలు విడిచారని.. వారి త్యాగాన్ని వర్ణించడానికి మాటలు చాలవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉరి కంబం ఎక్కినా వారి ముఖాల్లో భయం లేదని.. దేశం కోసం ప్రాణాలు విడుస్తున్నామనే ఆనందమే ఉందన్నారు. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలకు సందేశమిచ్చారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు భారీ సంఖ్యలో పెరిగాయని ప్రధాని తెలిపారు. భీమ్‌ యాప్‌ను రెండు నెలల్లోనే 18కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వెల్లడించారు. పాఠశాలలు, దుకాణాలు, సంస్థలు సహా దాదాపు అన్ని రంగాల్లో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. నగదు రహిత లావాదేవీల ఉద్యమానికి దేశం మొత్తం మద్దతు పలికిందన్నారు.
భారత్‌కు బంగ్లాదేశ్‌ ఎప్పుడూ నమ్మదగిన నేస్తమని మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న ఆ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి బంగ్లాదేశ్‌ ప్రజలు చరిత్రాత్మక విజయం సాధించారన్నారు. బంగ్లాదేశ్‌తో స్నేహబంధం ఎప్పుడూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*