మావోయిస్టుల మందుపాతర

ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా గొల్లపల్లి కిష్టారం సమీపంలోని పలోడి అడవుల వద్ద మంగళవారం మావోయిస్టులు అమర్ఛిన మందుపాతరకు తొమ్మిదిమంది సిఆర్‌పి ఎఫ్‌ కోబ్రా జవాన్లు బలయ్యారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై, తెగిపడిన జవాన్ల మృతదేహాలతో భయానకంగా తయారైంది. మరో ఇద్దరు జవాన్లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మంగళ వారం ఉదయం సిఆర్‌పిఎఫ్‌ 212 బెటా లియన్‌కు చెందిన జవాన్లు యాంటీ ల్యాండ్‌ మైన్‌ప్రూఫ్‌ వాహనంలో కూంబిం గ్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. మావోయిస్టులు పోలీసులే లక్ష్యంగా అమర్చిన భారీ మందుపాతర పేల్చటంతో వాహనం గాలిలో తేలిపోయి కింద పడింది. దీంతో తొమ్మిదిమంది జవాన్లు అక్కడిక్కడే మృతి చెందారు. జవాన్ల శరీరాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎఎస్‌ఐ ఆర్‌కెఎస్‌ తోమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ అజరుకుమార్‌ యాదవ్‌, మనోరంజన్‌ లక్రా, జితేంద్రసింగ్‌, షోబిత్‌కుమార్‌శర్మ, లక్ష్మణ్‌, మనోజ్‌సింగ్‌, ధర్మేంద్రసింగ్‌, హెచ్‌ఎస్‌ చంద్ర మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జవాన్లు మడకం కుమార్‌, రాజేష్‌ కుమార్‌లను హెలీకాప్టర్‌ ద్వారా రారుపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*