మార్కెట్లోకి క్విడ్ క్లెంబర్

న్యూఢిల్లీ : ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనోకు చెందిన ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌లో సరికొత్త రకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. క్విడ్ ైక్లెంబర్ పేరుతో విడుదల చేసిన ఈ కారు ఢిల్లీ షోరూంలో ప్రారంభ ధరను రూ.4.3 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు రెండు రకాల్లో లభించనున్నది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌ను రూ.4.3 లక్షలకు, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ) మోడల్‌ను రూ.4.6 లక్షలకు విక్రయించనున్నట్లు సంస్థ ప్రకటించింది. వినియోగదారుల అవసరాలమేరకు ఈ నూతన వెర్షన్‌ను రూపొందించినట్లు రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమిత్ సాహ్ని తెలిపారు.1.0 లీటర్ల ఎస్‌సీఈ ఇంజిన్‌తో తయారైన ఈ కారు మెరుగైన పనితీరు కనబరుచనున్నదని తెలిపారు. గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పో ఈ కారును ప్రదర్శించింది. భారత్‌లో మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, రోడ్‌మ్యాప్ చాలా స్పష్టంగా ఉందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*