బాధితులకు ప్రభుత్వం అండ

గుంటూరులో అతిసార వ్యాధి బారిన పడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హామీ ఇచ్చారు , మృతుల కుటుంబసభ్యులకు చంద్రన్న బీమాతో పాటు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబీకుల వద్దకు వెళ్లి సంబంధిత చెక్కులను వారికి అందజేశామని,  ఇంకా ఎవరైనా మరణించినట్లు ఆ కమిటి నిర్ధారిస్తే వారికి కూడా ఎక్స్ గ్రేషియా అందజేస్తామని చెప్పారు.  ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించామని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మునిసిపల్, ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది రక్షిత మంచినీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకూ తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.మొత్తం 130 మంది అతిసార బాధితులు ఆసుపత్రిలో చేరారని, ఆ సంఖ్య ఈరోజుకు 82కు తగ్గిందని అన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన వారు ఎంత మందో నిర్ణయించేందుకు ఓ కమిటీ వేశామని, ఎనిమిది మంది మృతి చెందినట్టు ప్రస్తుతానికి ఆ కమిటీ నిర్ధారించిందని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*