ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి రెండేళ్ల జైలు శిక్ష

 

 

ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డితో పాటు మరో 10 మందికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నెల్లూరు జిల్లా గూడూరు అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లావణ్య ఈ తీర్పును వెలువరించారు. కేసు వివరాల్లోకి వెళ్తే, 2011 అక్టోబర్ 3న అంకులపాటూరులో వీఎస్ఎఫ్ అనే కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్న విద్యుత్ పరిశ్రమ కోసం ప్రజాభిప్రాయ సేకరణను అప్పటి తహసీల్దార్ రోజ్ మాండ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా, పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి గూడూరు సీఐ రాంబాబుపై పలువురు దాడి చేసి గాయపరిచారు. దీంతో, అప్పట్లో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, 12 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, వీరిపై నేరారోపణలు రుజువు కావడంతో, ఒక్కొక్కరికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 4,700 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*