సైన్యానికి మోడీ దీపావళి కానుక

modi-government-s-diwali-gift-indian-soldiers-likely-get-10-arrears

సాయుధ బలగాల్లో నెలకొన్న కొత్త పే గ్రేడ్ వివాదాన్ని సద్దు మణిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా భారత సైనికులకు ప్రత్యేక కానుకలు అందించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 10న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అధ్యక్షన జరిగిన సమావేశంలో పే కమి కమిషన్ నోటిఫికేషన్‌లో కొన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నందున తాత్కాలికంగా ఏరియర్స్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో సైనికులందరికీ జనవరి 2016 నుంచి 10శాతం ఏరియర్స్(కరువు భత్యం కూడా) కలుపుకుని చెల్లించనున్నారు. అంటే, ప్రతీ సైనికుడు ఒక నెల జీతం బోనసగా పొందనున్నాడన్నమాట. అక్టోబర్ 30 దీపావళి పర్వదినం పురస్కరించుకుని అంతకంటే ముందే ఈ మొత్తం చెల్లించనున్నారు. సివిల్స్ సర్వీసెస్‌లా సాయుధ బలగాలు ఇప్పటి వరకు ఏరియర్స్ పొందలేదు, జీతాల పెంపుదల కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*