ఆ చిన్నారికి మోదీ ఏం పేరు పెట్టారో తెలుసా!

modi-mirzapur-couple-gets-a-phone-call-from-pm-modi-who-names-their-newborn-baby

చిన్నారి.. ఏమిటీ, మోదీ పేరు పెట్టడం ఏమిటీ అనుకుంటున్నారా? అవును, మీరు చదివింది కరెక్టే. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ఓ జంటకు ఫోన్ చేసి, వారికి పుట్టిన ఆడబిడ్డకు నామకరణం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ జిల్లాలో నయాపురా హసీపూర్‌ గ్రామానికి చెందిన భరత్ సింగ్, విభా సింగ్‌ దంపతులకు ఈ అదృష్టం దక్కింది. తమకు పుట్టిన ఆడ బిడ్డకు నామకరణం చేయాలని విభా సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖ అందుకున్న మోదీ వెంటనే స్పందించారు. భరత్ సింగ్‌కు స్వయంగా ఫోన్ చేసి ‘‘నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నా. మీ భార్య విభా సింగ్ రాసిన లేఖ నాకు అందింది. ఆడ బిడ్డకు జన్మనిచ్చినందుకు మీకు శుభాకాంక్షలు. మీ పాపకు ‘వైభవి’ అని నామకరణం చేయండి. ఈ పేరులో అమ్మ, నాన్నల పేర్లు కలుస్తున్నాయి. భవిష్యత్తలు వైభవి మీ కుటుంబానికి ఆధారం అవుతుంది. ఆమె కలలను మీరు సాకారం చేయండి’’ అని తెలిపారు. మోదీ ఫోన్‌ కాల్‌తో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. మీడియా ప్రతినిధుల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకుంది. స్వయంగా ప్రధానమంత్రే తమ కుమార్తెకు నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ జంట ఉబ్బితబ్బిబవుతోంది. ‘‘వైభవి.. ఆగస్టు 13న పుట్టింది. మా కూతురికి మోదీతో నామకరణం చేయించాలనే ఉద్దేశంతో ఆ తర్వాతి రోజే ప్రధానమంత్రి కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేశా. ఆ వెంటనే మోదీ నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. తాజాగా ఫోన్ చేసి మరీ నామకరణం చేయడం మేము, మా కూతురు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం’’ అని తండ్రి భరత్ సింగ్ వెల్లడించాడు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*