సామాన్య మహిళగా వెళ్తే కొత్తపల్లి గీతను పట్టించుకోలేదు, ఎంపీ అని తెలిశాక..

mp-kothapalli-geetha-makes-surprise-visit-araku-govt-hospital

తాను ఓ సామాన్య మహిళగా ఆసుపత్రికి వెళ్లానని, అయితే తనను ఎవరూ పట్టించుకోలేదని అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత సోమవారం నాడు ఆరోపించారు. తన నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోను పేదలకు సరైన వైద్యం అందటం లేదని ఆమె వాపోయారు. సరిపడా వైద్యులు, మౌలిక సదుపాయాలు లేక ఎక్కడికి అక్కడే వైద్యం పడకేసిందని చెప్పారు. సామాన్య మహిళగా ఆసుపత్రికి వెళ్లిన తనను కనీసం ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఎంపీ అని తెలిసిన తర్వాత మాత్రమే హడావుడి చేశారన్నారు. ఆసుపత్రి పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*