వర్షంతో ముంబయి వణికిపోయింది…….!

ముంబైని గత మూడు రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లన్నీ జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఎక్కడా వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడి వారక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ శాంతాక్రజ్ లో చిక్కుకుపోయారు. దగ్గర్లో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేయడంతో, ఆయన తన కుమార్తెతో వచ్చి, ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చారని ఆయన చెప్పారు. దాదాపు పన్నెండేళ్ల క్రితం.. అంటే 2005లో భారీగా కురిసిన వర్షంతో ముంబయి వణికిపోయింది. మళ్లీ ఆ స్థాయిలో భారీ వర్షం తాజాగా నమోదైంది.సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం.. అంతకంతకూ పెరుగుతూ.. మంగళవారం మధ్యాహ్నానానికి మరింత తీవ్రంగా మారింది. వర్షం స్థానే అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వ యంత్రాంగం అప్పటికప్పుడు అలెర్ట్ అయి.. స్కూళ్లు.. ఆఫీసులకు హాఫ్ డే నుంచి సెలవు ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. వర్షం కారణంగా సెలవు దక్కిందన్న ఆనందపడిన చాలామందికి తమకు ఎదురయ్యే ఇబ్బందుల్ని అస్సలు ఊహించలేకపోయారు. భారీగా కురిసిన వర్షాలతో రోడ్లు మొత్తం చెరువులుగా మారిపోవటంతో పాటు.. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయేలా చేసింది. ఇక.. నగరంలోని లోతట్టు ప్రాంతాల దుస్థితి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. నగరంలోని ప్రధాన రహదారులైన ఈస్ట్రన్.. వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవేలతో పాటు సియాన్ – పన్వెల్ రహదారి.. ఎల్ బీఎస్ రూట్లు మొత్తం ట్రాఫిక్ తో స్తంభించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*