యనే నా అదృష్టకారకుడు!

గబ్బర్‌సింగ్ సమయంలో పవన్‌కల్యాణ్ ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. నటుడిగా, వ్యక్తిగతంగా ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. కెరీర్‌లో నా అదృష్టానికి పవన్‌కల్యాణ్ కారకుడు అని చెప్పింది శృతిహాసన్. పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. ఆయన గురించి శృతిహాసన్ మాట్లాడుతూ సినిమాల పట్ల ఆసక్తిని చూపుతూనే సమాజం, ప్రాపంచిక విషయాల గురించి పవన్‌కల్యాణ్ ఎక్కువగా ఆలోచిస్తారు. అందరి క్షేమాన్ని కాంక్షిస్తుంటారు. నమ్మిన విలువకు కట్టుబడి ఉండే గొప్ప వ్యక్తిత్వమున్న మనిషి ఆయన అని తెలిపింది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ను ప్రేమించే యువతిగా శృతిహాసన్ కనిపించనుంది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కిషోర్‌కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహించారు. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తమిళ చిత్రం వీరమ్‌కు రీమేక్ ఇది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*