సోనీ మృతిలో ట్విస్ట్

mysterious-death-soni-nalgonda-district

నల్లగొండ జిల్లా గుట్టుప్పల గ్రామంలో బొడికే సోని అనే 19 ఏళ్ల యువతి కిరోసిన్ గాయాలతో మరణించిన సంఘటన వివాదంగా మారుతోంది. గట్టుప్పలను మండలంగా ప్రకటించాలని మహిళలు దీక్షలు చేస్తున్న నేపథ్యంలో దీక్షలో పాల్గొన్న బొడిగ సోని(19) అనే యువతి శుక్రవారం కిరోసిన్‌ పోసుకొని మరణించినట్లు భావించారు. అయితే, ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానంతో తల్లిదండ్రులే సోనీని హత్య చేసి ఉంటారని, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వస్తున్నాయి. సోని మృతి తర్వాత డిఐజి అకున్ సబర్వాల్ గ్రామానికి వచ్చారు. సోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లొ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు వచ్చి పరిశీలించారు. పోలీసులను మోహరించి, బాష్పవాయు గోళాల వాహనానను మోహరించారు సోని తలకు తీవ్రమైన గాయమవడంతోనే మృతిచెందినట్లు వైద్యుల నివేదికలో తేలిందని, ఆమె మృతికి కారణమైన దోషులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. సోని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులెవరూ రాకపోవటంతో మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచినట్లు చెప్పారు. ఎస్పీ ప్రకటనను బట్టి కూడా సోనీ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోని తలకు మాత్రమే కాకుండా వీపునకు గాయాలయ్యాయి. ఆమె శరీరం కూడా పూర్తిగా కాలి లేదు. దీంతో హత్య చేసిన తర్వాత శవాన్ని కాల్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోని మరమించిన ప్రదేశంలో ఆమె ఫోన్ ఉంది. కిరోసిన్ పోసుకుని తగులబెట్టుకున్న ఆనవాళ్లు కూడా లేవని అంటున్నారు బాత్రూం పక్కనే ఐదు లీటర్ల కిరోసిన్ డబ్బా, అక్కడే అగ్గిపెట్టె ఉన్నాయి. ఈ స్థితిలో పోలీసులు సోని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోనీ తల్లిదండ్రులను విచారిస్తున్నామని, శవపరీక్ష తర్వాతనే హత్యానా ఆత్మహత్యనా అనేది తేలుతుందని చండూరు ఎస్ఐ భాస్కర్ రెడ్డి చెప్పారు. గ్రామంలో ఉద్రిక్తత కాగా, నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది, ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గట్టుప్పల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కరుతూ గత కొద్ది రోజులుగా అక్కడి గ్రామస్తులు వివిధ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*