నాకు-మా నాన్నకు మధ్య గొడవ పెడతారా

nara-lokesh-takes-on-ys-jagan-and-sakshi

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి పత్రిక తనకు, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్య కూడా గొడవ పెట్టే ప్రయత్నాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు ఆన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో కుటుంబ ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు. హోంమంత్రి చినరాజప్ప ఫోటో, తెలంగాణలో టిడిపి పరిస్థితి, ఆస్తుల ఆరోపణలు, పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే అంశం, తనకు మంత్రి పదవి, 2019 ఎన్నికల్లో తన పోటీ.. ఇలా పలు అంశాల పైన ఆయన స్పందించారు. అంతేకాదు, చినరాజప్ప ఫోటో విషయంలో వైసిపి భారీ కుట్రకు పాల్పడినట్లుగా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చినరాజప్ప ఫోటోతో రెండు కులాల మధ్య చిచ్చుకు కుట్ర టిడిపి పార్టీ సమావేశంలో తాను వేదిక పైన ఉండటం, చినరాజప్ప వేదిక కింద నిలబడిన ఫోటోను వైసిపి రాజకీయం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*