గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య-బీజేపీ అభ్యర్ధిగా పోటీ..?

గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా సిద్ధమవుతోంది. ఇవాళ ఈ జాబితాను బీజేపీ ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇందులో పలు కొత్త ముఖాలకు చోటు కల్పించాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు కూడా చోటు దక్కబోతున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్ల క్రితమే బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. దీంతో రివాబా పేరు కూడా ఈ జాబితాలో ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో .. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ వంటి సీనియర్ నేతలను పోటీకి దింపకపోవచ్చని తెలుస్తోంది. దీనికి కారణం వారంతా 75 ఏళ్లు దాటిన వారే. అలాగే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల బంధువులు కూడా అనర్హులు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *