హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం పలు దేశాల్లో కనువిందు చేసింది. అయితే, తెలంగాణలో చంద్ర గ్రహణం పాక్షికంగానే కనిపించింది. చంద్ర గ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
హైదరాబాద్ నగరంలో సాయంత్ర 2.39 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కాగా, సాయంత్రం 5.12 గంటలకు పూర్తిగా కనిపించింది. చీకటి పడటంతో పాక్షిక చంద్రగ్రహణమే కనిపించింది.పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లతో ప్రజలు చంద్రుడిని వీక్షించారు. చంద్ర గ్రహణం 6.19 గంటలకు చంద్ర గ్రహణం పూర్తిగా ముగిసింది.