అరిష్టాల్ని పారద్రోలే నేనున్నాను

దేశంలో కొలువైన ఐదువందల హనుమంతుని అఖండ వర్ణ చిత్రాలతో అంజనేయస్వామి వైభవాన్ని ఆవిష్కరిస్తూ పురాణపండ శ్రీనివాస్ రచించిన గ్రంథం నేనున్నాను. వారాహి చలన చిత్రం పతాకంపై తెలుగులో పలు కథాబలమున్న చిత్రాలను నిర్మించిన సాయికొర్రపాటి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ సమర్పకుడిగా వ్యవహరించారు. ఐదు వందల నలభై ఐదు పేజీలతో అరిష్టాల్ని పారద్రోలే మహామంత్రరాశి, స్తోత్రాలు, పాఠాలు, వ్యాఖ్యానాల రూపంలో హనుమంతుని విశిష్టతను, మహిమలను కొనియాడుతూ చక్కటి సంకల్పంతో పురాణపండ శ్రీనివాస్ ఈ పుస్తకరచన గావించారు.

తెలంగాణలోని పలు ఆలయాలకు ఈ గ్రంథాన్ని అందజేశారు. లాభాపేక్షతో కాకుండా భక్తిభావనతో పదిమందికి పంచాలనే చక్కటి సదుద్దేశ్యంతో సాయికొర్రపాటి నేనున్నాను పుస్తక ప్రచురణకు పూనుకోవటం అభినందనీయమని ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, ఎస్.ఎస్.రాజమౌళి, క్రిష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నియతాత్మ సాధకుల కోసం పరమ పావనంగా ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దిన సాయికొర్రపాటికి, పురాణపండ శ్రీనివాస్‌కు తిరుమల ప్రధాన ఆర్చకులు రమణాదీక్షితులు మంగళశాసనాలు అందించడం గమనార్హం. గతంలో ఆధ్యాత్మికభావనతో శరణు శరణు అమ్మణ్ణి పుస్తకాల్ని ప్రచురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల్ని అందుకున్నారు సాయికొర్రపాటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*