ఇండియా ఎన్‌ఎస్‌జీకి న్యూజిలాండ్ మద్దతు

new-zealand-backs-indias-nsg-and-agreed-to-bilateral-trade-free

అణ్వాయుధాల సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ), ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌లలో భారత్ కు సభ్యత్వం కల్పించేందుకు, తమ వంతుగా కృషి చేస్తామని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ హామీ ఇచ్చారు. న్యూఢిల్లీలో బుధవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ జాన్ కీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలపై పలు ఒప్పందాలు కుదుర్చున్నారు. భారత్ తో స్నేహం ఇరుదేశాల అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ఈ సందర్భంగా కీ అన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆహార భద్రత, విద్యా, సాంస్కృతిక పరమైన అంశాలపై చర్చించినట్లు ఇరువురు ప్రధానులు సంయుక్తంగా మీడియాకు తెలిపారు. న్యూజిలాండ్ తో ఒప్పందం వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగపడతాయని మోదీ అన్నారు. ఇరుదేశాల మైత్రి గ్లోబల్ ఎకనామికల్ డెవెలప్ మెంట్ కు తోడ్పడుతుందని మోదీ గుర్తు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*