వంద మంది టెకీల‌కు కివీస్ బంప‌ర్ ఆఫ‌ర్‌

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వంద మంది టెకీల‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఆ దేశ రాజ‌ధాని వెల్లింగ్ట‌న్ సైబ‌ర్ రంగంలో టాప్ ప్లేస్ సాధించాల‌నుకుంటున్న‌ది. దాని కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా టెకీల‌ను ఇంట‌ర్వ్యూల‌కు ఆహ్వానిస్తున్న‌ది. అయితే ఆ ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌య్యే వంద టెకీల‌కు విమాన‌, భోజ‌న ఖ‌ర్చులు ఆ సంస్థ‌నే భ‌రించ‌నుంది. దీని కోసం వెల్లింగ్ట‌న్ సిటీ మేయ‌ర్ జ‌స్టిన్ లెస్ట‌ర్‌ ‘లుక్‌సీ’ అనే ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు. వెల్లింగ్ట‌న్‌ను టెక్ హ‌బ్‌గా మార్చాల‌న్న‌దే త‌మ ధ్యేయ‌మ‌న్నారు. ఇంట‌ర్వ్యూకు వెళ్లాల‌నుకునే టెకీలు ముందుగా ప్రోగ్రామ్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత సీవీ అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ త‌ర్వాత సెలెక్ట్ అయిన వంద మందిని న్యూజిలాండ్ తమ దేశానికి ఫేస్ టు ఫేస్ ఇంట‌ర్వ్యూకు ఆహ్వానిస్తుంది. ఇంట‌ర్వ్యూకు వెళ్లే టెకీల‌కు టూరిస్టు స్పాట్‌ల‌ను కూడా చూపిస్తార‌ట‌. ఇంటర్వ్యూలు మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*