నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

‘నిర్భయ’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆ దోషులకు ఉరే సరైనదని పేర్కొంటూ వారి రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దోషులది క్షమించరాని నేరమని ముగ్గురు సభ్యుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో కింది కోర్టులు నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధించగా.. దానిని జీవిత ఖైదుగా మార్చాలంటూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా వారి పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు, కింద కోర్టు విధించిన ఉరి శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దోషులకు ఉరి శిక్షలను గతేడాది మేలోనే సుప్రీంకోర్టు ఖరారు చేసింది.  సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని నిర్భయ తల్లిదండ్రులు వ్యాఖ్యా నించారు. జువెనైల్‌ సహా దోషులందరికీ సాధ్యమైనంత త్వరలో అమలుచేయాలని కోరారు. న్యాయం కోసం దాదాపు ఆరేండ్లుగా పోరాడిన తాము విజయం సాధించామని చెప్పారు. ‘ ఆలస్యం చేయకుండా నిందితులందరినీ సాధ్యమైనంత త్వరలో శిక్ష విధించాలి’ అని నిర్భయ తండ్రి బద్రినాథ్‌ సింగ్‌ కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*