పోలవరం డిపిఆర్‌పై గడ్కరీ అభ్యంతరం..

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, సిఎం చంద్రబాబు పోలవరం పనులను బుధవారం పరిశీలించారు.ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత ఖర్చెందుకు పెరిగిందో చెప్పాలని, ఈ డిపిఆర్‌లను వెంటనే కేంద్రానికి సమర్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. డిపిఆర్‌లో పునరావాసానికి ఖర్చు చాలా ఎక్కువగా పెరిగిందని, అంతకుముందు పేర్కొన్న విస్తీర్ణం కంటే ప్రస్తుత విస్తీర్ణాన్ని పెంచారని, ఇలా ఎందుకు పెరిగిందో వివరించాలని గడ్కరీ అధికారులను అడిగారు. అడ్వాన్స్‌లు, ఖర్చులకు సంబంధించి ఆర్థిక శాఖతో క్లియరెన్స్‌ తెచ్చుకోవాలని సూచించారు. ప్రాజెక్టు ఖర్చుల పెరుగుదలపైనా అయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలవరంపై ప్రధానమంత్రి మోడీ చాలా చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నాటికి పోలవరం పనులు పూర్తి చేస్తామంటోందని, అయితే ఫిబ్రవరికే పూర్తి చేయాలని సిఎంకు, అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు పలు సాంకేతిక సమస్యలున్నాయని తెలిపారు.

సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు చాలా వేగంగా సాగుతున్నాయన్నారు. 2017 అంచనాల ప్రకారం రూ.57,940 కోట్లకు అంచనా వ్యయం చేరిందన్నారు. 2019 డిసెంబ ర్‌కు ప్రాజెక్టును పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ పెట్టుకు న్నామన్నారుప్రభుత్వం ఖర్చు చేసిన రూ.19,050 కోట్లు రావాల్సి ఉందని, పాత డిపిఆర్‌ ప్రకారం మరో రూ.450 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. కొత్త డిపిఆర్‌ను వెంటనే ఆమోదించాలని కోరారు. ఎన్నికలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, కెఎస్‌ జవహర్‌, పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*