కటారా కేసులో నిందితులకు పాతికేళ్ల జైలు శిక్ష

nitish-katara-murder-convicts-get-25-yrs-in-jail

చెల్లిని ప్రేమించాడన్న కారణంగా ఓ యువకుడిని దారుణంగా చంపేశారు అమ్మాయి సోదరులు. ఆ యువకుడి పేరు నితీష్ కటారా. ఈ హత్య 2002లో జరిగింది. దేశంలో కటారా హత్య కేసుగా సంచలనం సృష్టించింది. ఆ కేసులోని నిందితులు ముగ్గురికీ సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పాతికేళ్ల జైలుశిక్షను విధించింది. సాధారణంగా జీవిత ఖైదు అంటే 14 ఏళ్లు మాత్రం జైలు శిక్ష ఉంటుంది. అయితే ఈ హత్యను అరుదైనదిగా పరిగణించిన కోర్టు పాతికేళ్ల జైలు శిక్షను వేసింది. హత్యను పరువు హత్యగా భావించింది. నిందితులు న్యూఢిల్లీకి చెందిన రాజకీయనాయకుడు డీపీ యాదవ్ కొడుకు, బంధువులే. డీపీ యాదవ్ కొడుకు వికాస్ యాదవ్, అతని కజిన్ విశాల్ యాదవ్ ప్రధాన నిందితులు కాగా సుఖ్ దేవ్ పెహల్వాన్ అనే వ్యక్తి ఏ3గా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వికాస్, విశాల్ లకు పాతికేళ్లు జైలు శిక్ష, సుఖ్ దేవ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కొన్నేళ్లుగా వీరి కేసులో విచారణ జరుగుతూనే ఉంది. జిల్లా కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు కేసు చేరింది. దిగువ కోర్టు 25 ఏళ్లు హత్య చేసినందుకు, 5 ఏళ్లు ఆధారాలని మాయం చేసినందుకు శిక్షగా విధించింది. సుప్రీం కోర్టు 5 ఏళ్ల శిక్షను తగ్గించి తుదితీర్పును ఇచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*