ప్రధానికి అండగా నితీశ్, కేజ్రీ

nitish-kejriwal-supports-pm-modi-on-surgical-strikes-issue

ఉగ్ర‌వాదం లాంటి అంశంలో వివాదాస్ప‌ద రాజ‌కీయ నిర్ణ‌యాలు చెల్ల‌వు అని బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఉగ్ర‌వాదాన్ని అణిచి వేసే అంశంలో కేంద్రానికి తాము అండ‌గా ఉంటామ‌ని, ఉగ్ర చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకు కావాల్సిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌న్ని నితీశ్ తెలిపారు. దేశ స‌రిహ‌ద్దుకు సంబంధించిన అంశంలో ఎక్కువగా ఆందోళ‌నకు గురికావాల్సిన అవ‌స‌రం లేద‌ని, దేశం యావ‌త్తు ఈ అంశంలో ఏక‌మై ఉంద‌ని, శ‌త్రు దేశాన్ని ఎదుర్కొనేందుకు భార‌తీయ ఆర్మీ ద‌గ్గ‌ర స‌త్తా ఉంద‌ని నితీశ్ అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా భార‌త ఆర్మీ చేసిన స‌ర్జిక‌ల్ దాడుల‌పై స్పందించారు. రాజ‌కీయంగా అనేక అంశాల్లో మోదీతో వ్య‌తిరేకించినా, దేశ భ‌ద్ర‌త విష‌యంలో ఆయ‌న్ను స‌మ‌ర్థిస్తున్న‌ట్లు కేజ్రీ అన్నారు. స‌ర్జిక‌ల్ దాడుల అంశంలో ప్ర‌ధానికి సెల్యూట్ చేస్తున్న‌ట్లు కేజ్రీ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*