కెసిఆర్‌కు చెప్పే స్థాయి నాది కాదు

no-dearth-artistes-bollywood-kavitha-on-ban-on-pak-actors

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో మహిళలుంటే బాగుంటుందని, అయితే కేసీఆర్‌కు చెప్పే స్థాయి తనది కానది ఆయన తనయ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం పెద్ద పీట వేస్తోందని, చాలా కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. దేశభక్తిని చాటుకోవాల్సిన సమయంలో టోకనిజం పని చేయదని ఆమె అన్నారు. పాకిస్తాన్ ఆర్టిస్టులను తీసుకునే విషయంలో బాలీవుడ్ పునరాలోచన చేయాలని ఆమె అన్నారు. పాకిస్తాన్ పదే పదే దేశంపై దాడికి పూనుకున్న ఈ అయోమయ స్థితిలో బాలీవుడ్ పాకిస్తానీ ఆర్టిస్టులతో పనిచేయడం సరికాదని అన్నారు. క్రీడాకారులు పాకిస్తాన్‌తో ఆడడాన్ని నిరాకరిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. భారతదేశంలో ఆర్టిసులకు కొదవ లేదని, ఈ సమయంలో బాలీవుడ్ ఆర్టిస్టులు దేశం కోసం నిలబడాలని ఆె అన్నారు. అందరూ రాజకీయ నాయకులై పోయారని ఆమె అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*