పాక్ నటులున్న సినిమాలకు థియేటర్లు లేవు

no-theatres-for-pak-acted-bollywood-movies-says-owners

పాకిస్థాన్ నటీనటులున్న ‘హాయే దిల్ హాయ్ ముష్కిల్’ సినిమాకు థియేటర్లు ఇవ్వబోమని సినిమా ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ నటీనటులు ఉన్న బాలీవుడ్ సినిమాలు, ఇతర సినిమాలు ఆడేందుకు థియేట్లు ఇవ్వకూడదని నిర్ణయించామని ‘సినిమా ఓనర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు నితిన్ ధాతర్ తెలిపారు. గతనెలలో మోషన్ ఫిక్షర్ సంస్థ గత నెలలో పాకిస్థాన్ నటులకు అవకాశం ఇవ్వకూడదని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ నటీనటులు దేశం విడిచిపోవాలని లేకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, శివ సేనలు ఇచ్చిన అల్టీమేటమ్స్ వివాదాస్పదమైన విషయం విదితమే. ఇదే అంశంపై బాలీవుడ్ లోనూ చీలికలు వచ్చాయి. పాకిస్థాన్ సంగీత దర్శకులు, గాయకులు సప్ఖత్ అమానత్, సల్మాన్ అహ్మాద్ ఉరీ ఘటనను తీవ్రంగా ఖండించారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొన్న, సంబంధాలు బలపడాలని వారు ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. తాజాగా సినిమా థియేటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో కరణ్ జోహార్ సినమాపై నాలుగు రాష్ట్రాల్లో ప్రభావం పడనుంది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటకలతో ఈ సంఘం ఆధ్వర్యంలో థియేటర్లు నడుస్తున్నాయి. షారూఖ్ హీరోగా నటిస్తున్న ‘రాయిస్’లోనూ పాక్ నటి మహీరాఖాన్ నటిస్తోంది. అయితే ఆ సినిమాపై ఇప్పుడే ఏం మాట్లాడబోమని దాతర్ అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*