ఉగ్రోత్పత్తి దేశంగా పాకిస్థాన్.. అమెరికా చట్టం!

online-petition-to-white-house-to-declare-pak-as-terror-state

పాకిస్థాన్‌ను ఉగ్రోత్పత్తి (ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం) దేశంగా అధికారికంగా ప్రకటించేందుకు అమెరికా శ్వేత సౌధం సిద్ధమవుతోంది. సర్జికల్ దాడుల తర్వాత పాకిస్థాన్ ను ఏకాకి చేసేందుకు ప్రపంచమంతా ఏకమవుతుందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. పాకిస్థాన్‌ను ఉగ్రోత్పత్తి దేశంగా గుర్తించేలా శ్వేత సౌధం చట్టం చేయాలని ఆర్.జీ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా స్వీకరించేందు ఆన్‌లైన్ పిటిషన్లు ప్రారంభించారు. సెప్టెంబర్ 21న ప్రారంభమైన ఈ ఆన్ లైన్ పిటిషన్లు రెండువారాల్లోనే దాదాపు 5 లక్షలు దాటి 6లక్షలకు చేరువలో ఉంది. నిబంధనల ప్రకారం 60 రోజుల్లో పదిలక్షల ఆన్ లైన్ పిటిషన్లు వస్తే అమెరికా శ్వేతసౌధం (పార్లమెంటు) నిర్ణయం తీసుకుంటుంది. వీ ద పీపుల్ ఆస్క్ ద అడ్మినిస్ట్రేషన్ టు డిక్లేర్ పాకిస్థాన్, స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం (ఉగ్రవాదాన్ని పెంచే పోషిస్తున్న దేశంగా పాకిస్థాన్ ను ప్రకటించాలని అమెరికా అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం) అనే నినాదంతో ఈ ఆన్ లైన్ పిటిషన్ పోరాటం మొదలైంది. ‘చట్టానికి అవసరమయ్యే పది లక్షల ఆన్ లైన్ పిటిషన్లు సాధించేందాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం’ అని ఆన్ లైన్ పిటిషన్ పోరాటానికి మద్దతుగా నిలిచిన శాస్త్రవేత్త అంజూ ప్రీత్ చెబుతున్నారు. ‘తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారు స్పందించే సమయం ఆసన్నమైంది. శ్వేతసౌధానికి వినతులు పంపే (ఆన్ లైన్ పిటిషన్) ఉద్యమంలో మీరు భాగస్వాములు కండి’ అంటూ ఆమె కోరుతోంది. శ్వేతసౌధంలోని మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా నియమించిన హౌజ్ సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్, హెచ్.ఆర్. 6069 పేరిట తీవ్రవాదానికి ఊతమిస్తున్న దేశంగా పాకిస్థాన్ ను ప్రకటించాలన్న అంశంపై తీర్మానం రూపొందించారు. ‘పాకిస్థాన్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి బాధిత దేశాలైన అమెరికా, ఇండియా ఇతర దేశాలకు ఈ పిటిషన్ ప్రాధాన్యమైంది,’ అని పిటిషన్ రూపొందించిన ఆర్.జీ అన్నారు. వీ ద పీపుల్ అనే నినాదాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రారంభిచారు. దాని స్పూర్తిగానే ఇప్పుడు ఉగ్రవాదం పై ఆన్ లైన్ పిటిషన్లు మొదలయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*