ఎల్‌వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులు

pak-troops-resort-to-mortar-shelling-along-loc

సర్జికల్ స్ట్రయిక్ దెబ్బకు దిమ్మతిరిగి మైండు బ్లాంకైన పాకిస్థాన్ ఏమీ చేయాలో తోచక…సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు విరమణను ఉల్లంఘిస్తోంది. సెప్టెంబర్ 18న జరిగిన ఉరీ ఘటన అనంతరం పాకిస్థాన్ సైన్యం శనివారం వరకు నాలుగు సార్లు సరిహద్దుల్లో కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు తెగబడింది. అక్నూర్ సెక్టార్ లో పల్లన్ వాలాలో పాకిస్థాన్ సైన్యం శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు కాల్పులు ప్రారంభించింది. పాక్ కాల్పులకు దీటుగా ఇండియన్ ఆర్మీ సమాధానమిచ్చింది. ఉదయం 3 గంటల నుంచి 8 గంటల దాకా ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పుల పరంపర జరిగినట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో ఇండియన్ దళాలవైపు ఎవరూ గాయపడలేదని సమాచారం. పాకిస్థాన్ సైన్యం మొదలుపెట్టిన ఆకస్మిక ఫైరింగ్ కు సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పాక్ గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. పాకిస్థాన్ ఒక్కరోజు సమయం (శుక్రవారం- శనివారం)లో రెండుసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించడం గమనార్హం. శుక్రవాం చప్రియాల్, సమ్వాన్ సెక్టార్ లో కాల్పులు జరిపింది. సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం పాకిస్తాన్ నుంచి, అది ప్రేరేపిస్తున్న ఉగ్రవాదుల నుంచి దాడులు జరగొచ్చని దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లోని పదికిలోమీటర్ల మేర ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*