భారత్ లో జలాశయాలు పేల్చేస్తాం

pakistan-jaish-e-muhammad-terrorist-maulana-masood-azar

జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ హెచ్చరికలను భారత్ సీరియస్ గా తీసుకుంది. పదేపదే భారత్ ను హెచ్చరిస్తున్న మసూద్ అజహర్ విషయాలను భారత్ క్షణ్ణంగా పరిశీలిస్తుంది. సింధు జలాలు పాక్ కు పంపిణి చేసే ఒప్పందం విషయం పరిశీలిస్తామని భారత్ చెప్పడంతో మౌలానా మసూద్ అజహర్ భారత్ లోని జలాశయాలు (డ్యాంలు) పేల్చేయాలని జీహాదీలకు పిలుపునిచ్చాడు. భారత్ లోని ప్రముఖ జలాశాయాల దగ్గర ఆత్మాహుతి దాడులు చెయ్యాలని జైష్ జీహాదీలకు చెప్పాడు. ఈ విషయంపై జీహాదీలకు ఓ ఆడియో సందేశం పంపించాడని భారత ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. మసూద్ అజహర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ పాక్ కు పదేపదే చెప్పినా వారు పట్టించుకోలేదు. భారత్ కావాలనే సింధు జలాల పంపిణి ఒప్పందం పరిశీలిస్తామని చెప్పి పాక్ ప్రజలను భయపెట్టాలని చూస్తుందని, ఆ పప్పులు ఏమీ ఉడకవని మసూద్ అజహార్ బహిరంగంగా చెప్పాడు. భారత్ మనకు నీరు వదలకపోతే అక్కడి ప్రముఖ జలాశయాలను ఆత్మాహుతి దాడులతో పేల్చేయాలని జీహాదీలకు పిలుపునిచ్చాడు. చాన్స్ ఇస్తే భారత్ లో కల్లోలం సృష్టిస్తాం: మసూద్ భారత్ లోని ప్రముఖ జలాశయాలను పేల్చేయడానికి మాకు నలుగురు జీహాదీలు చాలని మసూద్ అజహర్ గర్వంగా చెబుతున్నాడు. నలుగురు జీహాదీలు నాలుగు రోజుల పాటు భారత్ ఆర్మీని ముప్పుతిప్పలు పెట్టారని పరోక్షంగా పఠాన్ కోట్ ఉగ్రదాడిని ఉదాహరణగా చెప్పాడు. భారత ఆర్మీ పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత మసూద్ అజహర్ పదేపదే భారత్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఐరాసకు మనవి చేసింది. పాక్ ఆర్మీకి నవాజ్ షరీఫ్ వార్నింగ్: చేసింది చాలు మూసుకోండి ! అయితే పక్కలో బల్లెంలా ఉన్న చైనా ఆ ప్రతిపాదనను అడ్డుకుంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా మసూద్ అజహర్ కు సహకరిస్తున్న చైనా భారత్ ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. అయితే మసూద్ అజహర్ మీద భారత్ నిఘా వర్గాలు ఓ కన్నేసిపెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా భారత్ లోని ప్రముఖ జలాశయాల దగ్గర పర్యటకుల ముసుగులో ఎవరైనా ఉగ్రవాదులు సంచరిస్తున్నారా ? అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గురువారం మసూద్ జైష్ పత్రికలో భారత్ మీద దాడులు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వానికి మనవి చేసిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*