పాకిస్థాన్ నుంచి మోదీకి శాంతి సందేశం

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు గెలిచి ఫుల్ ఖుషీలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఓ పాకిస్థాన్ బాలిక లేఖ రాసింది. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ముందు రెండు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొల్పేలా చూడాల‌ని కోరింది. 11 ఏళ్ల ఆ బాలిక పేరు అకీద‌త్ న‌వీద్‌. ఇండియా, పాకిస్థాన్ బుల్లెట్లు కొనే కంటే.. బుక్స్ కొనాలంటూ ఆ లేఖ‌లో పెద్ద సందేశ‌మే ఇచ్చింది. రెండు దేశాల మ‌ధ్య స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి.. తుపాకీలు కొనుగోలు చేసేకంటే.. రెండు దేశాల్లోని ల‌క్ష‌ల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయండి అంటూ అకీద‌త్ కోరింది. మార్చి 13న రెండు పేజీల లేఖను అకీద‌త్‌.. మోదీకి రాసింది. సంబంధాలు మెరుగుప‌రుచుకోవ‌డం వ‌ల్ల రెండు దేశాల‌కూ ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆమె లేఖ‌లో అభిప్రాయ‌ప‌డింది. గ‌తంలోనూ శాంతి కోరుతూ ప్ర‌పంచ దేశాధినేత‌ల‌కు అకీద‌త్ లేఖ‌లు రాయ‌డం పాకిస్థాన్‌లో ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*